ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌కు ఎలాంటి కేన్సర్ లేదని ఆ దేశానికి చెందిన అల్ అహ్రామ్ పత్రిక వెల్లడించింది. స్వదేశంలో చెలరేగిన ప్రజా తిరుగుబాటులో 800 మంది నిరసనకారులను కాల్చిచంపిన ఘనటనలో ముబాకర్ కోర్టు విచారణను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఈయనకు కేన్సర్ వ్యాధి ఉందని ఆయన లాయర్లు ఆరోపణలు వాదిస్తున్నారు.
వీటిని ఖండించే విధంగా ఆ పత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ముబారక్‌కు కేన్సర్ ఉందంటూ ఆయన లాయర్లు చేస్తున్న వాదనలను ఈ పత్రిక ఖండించింది. అన్ని వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం ఆయనకు కేన్సర్ లేదని వైద్యులు తెలిపినట్లు అల్ అహ్రమ్ పేర్కొంది.
అయితే, ముబారక్ హృద్రోగంతో, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్టు పత్రిక పేర్కొంది. అయితే రెండు మూడు రోజుల్లో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఆరోపణలు సుమారు 800మంది నిరసనకారులను కాల్చి చంపించిన ఘటనలోను ముబారక్ కోర్టు విచారణనెదుర్కొంటున్న సంగతి తెలిసిందే.