భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం సాయంత్రం ఈజిఫ్టు చేరుకున్నారు. ఈజిప్టులోని షర్మేల్ షేక్ నగరంలో జరిగే అలీనోద్యమ దేశాల (నామ్) సదస్సులో మన్మోహన్ సింగ్ పాల్గొంటారు. ఇదిలా ఉంటే ప్రధాని ఈజిప్టులో అడుగుపెట్టిన సమయంలోనే భారత్, పాకిస్థాన్ దేశాలు విదేశాంగ శాఖ కార్యదర్శుల సమావేశం కూడా జరిగింది.
ఇదిలా ఉంటే మన్మోహన్ సింగ్, పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ మధ్య గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో చర్చలు జరుగుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి. నామ్ సదస్సులో భాగంగా పాకిస్థాన్, భారత అధికారిక బృందాల మధ్య జరిగే చర్చల్లో తీవ్రవాదం, ద్వైపాక్షిక అంశాలపై ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి.