వివాదాస్పద యురేనియం శుద్ధి కార్యక్రమం విషయంలో అగ్రరాజ్యాలు ఇరాన్‌పై మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో.. కొందరు ఉన్నతస్థాయి అధికారులు ఇరాన్‌లో రెండో యురేనియం శుద్ధి ప్లాంటు ఉన్న విషయాన్ని వెల్లడించారు.
ఇరాన్ అణు వలయానికి సంబంధించిన అధికారులుగా భావించబడుతున్న వీరు.. ఇరాన్‌లో రెండు యురేనియం శుద్ధి ప్లాంటు ఉన్న విషయాన్ని బయటపెట్టారు.
ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వమే ఐక్యరాజ్యసమితి అణు శక్తి నియంత్రణ సంస్థ (ఐఏఈఏ) చీఫ్ మొహమెద్ ఎల్‌బరాదీకి రాసిన లేఖలో తెలియజేసినట్లు చెప్పారు. తమ దేశంలో రెండో యురేనియం శుద్ధి ప్లాంటు ఉన్నట్లు ఇరాన్ ప్రభుత్వం సోమవారం ఐఏఈఏ చీఫ్‌కు లేఖ పంపినట్లు వెల్లడించారు.