Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండోనేషియా భూకంపం: 1,100కి మృతుల సంఖ్య

Advertiesment
ఇండోనేషియా
భూకంపం ఇండోనేషియాను తీవ్రంగా కుదిపివేసింది. ఈ భూకంప తాకిడిలో మృతుల సంఖ్య 1,100కు చేరుకుంది. అలాగే సుమారు వేల మంది గల్లంతయినట్లు తెలుస్తోంది. గల్లంతయిన వారిలో కొంత మంది భవంతుల్లోను మరియు ఇతర చోట్ల సంక్లిష్ణ పరిస్థితుల్లో ఉండవచ్చని సమాచారం. భూకంపం సంభవించినప్పటి నుంచి ప్రజలను రక్షించేందుకు భద్రతా దళాలు రంగంలోకి దిగాయి.

కానీ, నిన్న రాత్రి మాత్రం శోధించే కార్యక్రమాలను నిలిపివేశారు. ఇండోనేషియా అధ్యక్షుడు సుసిలో బమ్‌బాంగ్ యుధోయనో మాట్లాడుతూ, ఎంత నష్టం జరిగిందో అంచనాకు రాలేకపోతున్నామన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలకు మాత్రం సిద్ధమయ్యామన్నారు.

బుధవారం రిక్టర్ స్కేలుపై 7.6గా భూకంప తీవ్రత నమోదైనట్లు అధికారుల సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సమాచారం ప్రకారం.. 777 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య.. 1,100కి చేరుకునే లేదా ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. 440 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా తన చిన్న వయసులో ఇండోనేషియాలోనే గడిపారు. ప్రస్తుతం ఇండోనేషియాలో సంభవించిన సుమాత్రా భూకంపం నేపథ్యంలో.. సహాయాన్ని అందిస్తామని ఒబామా హా్మీ ఇచ్చారు. అలాగే సునామీ భీబత్సానికి గురైనా దక్షిణ పసిఫిక్ దేశాలు.. సమావో, అమెరికన్ సమావోలకు కూడా సాయం అందిస్తామన్నారు.

కాగా, ఇండోనేషియాలోని పడాంగ్‌లో అత్యధికంగా మృతుల సంఖ్య నమోదైంది. సుమారు. 500 భవంతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu