Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్ట్రేలియాలో తీవ్రవాద దాడి కుట్ర భగ్నం

Advertiesment
ఆత్మాహుతి దాడి
ఆస్ట్రేలియాలోని ఓ మిలిటరీ స్థావరంలో విధ్వంసానికి జరిగిన తీవ్రవాద కుట్రను పోలీసులు భగ్నం చేశారు. దీనికి సంబంధించి ఆస్ట్రేలియా భద్రతా యంత్రాంగం నలుగురిని అరెస్టు చేసింది. ఆత్మాహుతి దాడికి కుట్రపన్నినవారికి సోమాలియాతో సంబంధాలు ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఆస్ట్రేలియా మిలిటరీ స్థావరంపై ఆత్మాహుతి దాడి చేయడం ద్వారా భారీ విధ్వంసకాండకు వీరు కుట్రపన్నినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. వారి కుట్ర సఫలమై ఉంటే ఆస్ట్రేలియా చరిత్రలోనే భారీ ఉగ్రవాద దాడి జరిగివుండేదని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా తీవ్రవాద నిరోధక యంత్రాంగం మెల్‌బోర్న్ పరిసరాల్లోని నివాసాల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ తీవ్రవాద కుట్ర వెలుగుచూసింది.

దీనికి సంబంధించి నలుగురు సోమాలియా, లెబనాన్ పౌరులను అరెస్టు చేశారు. నిందితులందరూ 20 ఏళ్ల వయస్సులోనివారే. వీరిని మరికాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఆటోమేటిక్ ఆయుధాలతో మిలిటరీ స్థావరంపై దాడి చేసేందుకు వీరు వ్యూహరచన చేశారు.

తీవ్రవాద గ్రూపులోని సభ్యులు ఇంతకుముందు సోమాలియా వెళ్లివచ్చారని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు చెప్పారు. ఆస్ట్రేలియా మిలిటరీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని నిందితులు ఆత్మాహుతి దాడికి పథకరచన చేసినట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu