Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆఫ్గనిస్తాన్‌లో భారీ పేలుడు: 14 మంది మృతి

Advertiesment
మధ్య ఆఫ్గనిస్థాన్
మధ్య ఆఫ్గనిస్థాన్‌లో దుండగులు భారీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పదిమంది సాధారణ పౌరులతోపాటు నలుగురు పోలీసులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.

లోగర్‌ప్రావిన్స్‌లోని ఓ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసు అధికారి ముస్తఫా ఖాన్ తెలిపారు.

ఈ సంఘటన గురువారం ఉదయం జరిగిందని ఇందులో పదిమంది పౌరులతోపాటు నలుగురు పోలీసులున్నట్లు ఆయన వివరించారు.

ఇదిలావుండగా ఆఫ్గనిస్థాన్‌లోని దక్షిణ హేల్‌మంద్ ప్రాంతంలో అమెరికాకు చెందిన సైనికుల బృందం ఉందని, వారికి తన సత్తా ఏంటో చూపేందుకే తీవ్రవాదులు ఈ దాడులకు పాల్పడి ఉంటారని తాము భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu