Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆత్మాహుతి దళ సభ్యుడు నూర్డిన్ కాదు

Advertiesment
అనుమానిత తీవ్రవాది
జకార్తాలో గత నెల 17న జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో మృతి చెందిన అనుమానిత తీవ్రవాది నూర్డిన్ కాదని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇండోనేషియా మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది అయిన నూర్డిన్ ఈ ఆత్మాహుతి దాడిలో పాల్గొని ప్రాణాలు కోల్పోయాడని అధికారిక వర్గాలు ఇప్పటివరకు భావించాయి.

అయితే అనుమానిత తీవ్రవాది మృతదేహంపై నిర్వహించిన పరీక్షల్లో అతను నూర్డిన్ కాదని తేలింది. తీవ్రవాది డీఎన్ఏకి, నూర్డిన్ కుటుంబసభ్యుల డీఎన్ఏకి పోలికే లేదని పరీక్షల్లో తేలినట్లు ఇండోనేషియా పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మలేషియా పౌరుడైన నూర్డిన్ 2003 నుంచి ఇండోనేషియాలో తీవ్రవాద దాడులు జరిపుతున్నాడు.

గత కొన్నేళ్లుగా జరిగిన తీవ్రవాద దాడుల్లో ఇతని ప్రమేయం ఉందని ఇండినేషియా అధికారిక యంత్రాంగం బలంగా విశ్వసిస్తోంది. జులై 17న జకార్తాలోని రెండు లగ్జరీ హోటళ్లపై జరిగిన ఆత్మాహుతి దాడులకు ఇతనే ప్రధాన సూత్రధారి అని భావిస్తోంది. ఈ దాడుల్లో ఏడుగురు పౌరులు మృతి చెందారు.

Share this Story:

Follow Webdunia telugu