ఇరాన్ అణ్వస్త్ర రాజ్యంగా అవతరించడాన్ని అమెరికా, చైనా రెండు దేశాలు వ్యతిరేకిస్తున్నాయని హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ తమ దేశ పర్యటనలో ఉన్న చైనా ఉన్నతాధికార బృందంతో చర్చల అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేసుకోవడాన్ని ఇరుదేశాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు.
ఇరాన్ అణ్వస్త్ర రాజ్యంగా మారడం వలనే తలెత్తే పరిణామాలపై ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ విషయంలో అమెరికా ఆందోళనలను చైనా పంచుకోవడంపై హిల్లరీ క్లింటన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ అణ్వస్త్రాలు సమకూర్చుకుంటే ప్రాంతీయ ఆయుధ పోటీ మొదలవుతుందని ఇరుదేశాలు ఆందోళన చెందుతున్నాయన్నారు. మధ్యప్రాచ్య, గల్ఫ్ ప్రాంతాల్లో అస్థిరతకు దారితీసే అవకాశం కూడా ఉందన్నారు.