Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతర్జాతీయ యవనికపై కొత్తగా జీ-14

Advertiesment
అంతర్జాతీయం
, శనివారం, 11 జులై 2009 (10:04 IST)
అంతర్జాతీయ యవనికపై కొత్తగా జీ-14 అనే కూటమి ఆవిర్భావమైంది. ఇందులో జీ-8, జీ-5 దేశాలతో పాటు.. కొత్తగా ఈజిప్టుకు స్థానం కల్పించారు. ప్రపంచ దేశాలను ఆర్థికంగా, రాజకీయంగా నియంత్రించేందుకు గాను ఈ కూటమి ఆవిర్భవించినట్టు జీ-8, 5 దేశాల ప్రతినిధులు ప్రకటించారు.

అలాగే, ప్రపంచ పాలనా సంస్థల, ద్రవ్య సంస్థల సంస్కరణలను చేపట్టేందుకు జీ-8, జీ-5 దేశాధినేతలు తమ సుముఖత వ్యక్తం చేశారు. ప్రపంచ జనాభాలో 80 శాతం కలిగిన ఈ దేశాలు జీ-14 లాంటి ఒక ఉమ్మడి వేదిక మీదకు రావాలన్న ఆశాభావాన్ని ఆ రెండు గ్రూపుల శిఖరాగ్ర సమావేశాల నిర్వహణకు ఆతిథ్యమిచ్చిన ఇటలీ దేశపు అధ్యక్షుడు సిల్వియో బెర్లుస్కోనీ తన ప్రారంభోపన్యాసంలో అభిప్రాయపడ్డారు.

జీ-14 ఏర్పాటు, అంతర్జాతీయ పాలనా సంస్థల సంస్కరణలు చేపట్టాలని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలాడ సిల్వా ప్రప్రథమంగా ప్రతిపాదించారు. ఆర్థిక మాంద్యం దృష్ట్యా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్మించేందుకు తమ మార్కెట్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు.

దేశీయమార్కెట్‌పై ప్రధానంగా ఆధారపడిన భారత దేశంలో ద్రవ్య నిల్వలు మెరుగ్గానే ఉన్నాయని, మదుపులకు ఢోకా లేదని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. ప్రపంచ పర్యావరణ కాలుష్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలన్నింటిపై ఉందని ఆయన నొక్కివక్కాణించారు.

Share this Story:

Follow Webdunia telugu