Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతర్జాతీయ మహిళలకు కొత్త శాఖ: ఒబామా

Advertiesment
అంతర్జాతీయ మహిళలకు కొత్త శాఖ: ఒబామా
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి సంక్షేమార్థం ఓ నూతన విదేశాంగ పదవిని ఏర్పాటు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ హుస్సేన్ ఒబామ తెలిపారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ హయాంలో పనిచేసిన మిలెన్‌ విర్వెర్‌కు ఈ బాధ్యతలు అప్పగించనున్నట్లు ఒబామ పేర్కొన్నారు.

విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు సహకరిస్తూనే విర్విర్‌ ఈ పదవికి సేవలందిస్తారని వైట్‌‌హౌస్‌ తెలిపింది. మిలెన్ విర్వెర్‌ మహిళల కోసం పనిచేసే ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వాహకురాలు కావడం గమనార్హం. దీంతో అంతర్జాతీయ మహిళా సమాఖ్య సభ్యురాళ్ళు హర్షం ప్రకటించారు.

దీంతో ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను ఆలోచించి వాటికి కావాల్సిన చర్యలను చేపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu