Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టమోటా జ్యూస్‌తో బంగారు ఆభరణాలు మెరుస్తాయట!

Advertiesment
Tomato juice is a best cleaning agent
, సోమవారం, 1 సెప్టెంబరు 2014 (16:20 IST)
టమోటలను వంటల్లో జోడించడం మాత్రమే కాదు, టమోటోలు ఇంటిని కూడా శుభ్రం చేయడంలో సహాయపడుతాయి. టమోటో సాస్‌తో ఇంటిని శుభ్రం చేయడం వల్ల కొత్తవాటిలా మిళమిళా కాంతివంతంగా మెరిసిపోతుంటాయి. 
 
అయితే టమోటోలను ఉపయోగించి ఇంట్లో వస్తువులను శుభ్రం చేయడానికి ముందుగా గుర్తుంచుకోవల్సిన విషయం వాటిని ఉపయోగించే ముందు టమోటోకు అవుటర్ స్కిన్ తొలగించాలి లేదంటే అవి వస్తువుల్లో ఇరుక్కుపోవడం వల్ల తొలగించడం కష్టం అవుతుంది.
 
బంగారు నగలు కాంతివంతంగా మెరుస్తుండాలంటే టమోటో సాస్‌ను అప్లై చేసి తర్వాత శుభ్రం చేయాలి. బంగారు ఆభరణాలను శుభ్రం చేయడానికి టమోటో సాస్ ఒక సురక్షితమైన క్లీనింగ్ ఏజెంట్.
 
స్టెయిన్ లెస్ స్టీల్‌ వస్తువులకు అంటిన బ్లాక్ సర్కిల్స్ నివారించడానికి టమోటా పేస్ట్ అప్లై చేసి పది నిమిషాల తర్వాత రుద్ది కడిగేస్తే నల్ల మరకలు తొలగిపోతాయి. అలాగే రాగి వస్తువులను, త్రుప్పు పట్టిన వస్తువులను శుభ్రం చేయడానికి కూడా టమోటా జ్యూస్ ఉపయోగించవచ్చు. 
 
దుస్తుల మీద పడ్డ ఐరన్ రస్ట్ లైన్ తొలగించడానికి, ఆ లైన్ మీద టమోటో పేస్ట్‌ను రుద్ది 15 నిముషాలు డ్రై అయిన తర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి. ఇత్తడి వస్తువులను శుభ్రం చేయడానికి టమోటా జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
సిల్వర్ వస్తువులు తెల్లగా మిళమిళ మెరిపించడం కోసం టమోటో పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. మెటల్స్ ఎప్పుడు ప్రకాశవంతంగా ఉండటానికి టమోటో పేస్ట్‌ను యూజ్ చేసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu