Publish Date: Mon, 23 Jun 2014 (18:14 IST)
Updated Date: Mon, 23 Jun 2014 (18:15 IST)
ఇంటిలో మూలలు (కార్నర్స్) అందంగా కనపడేందుకు నానా తంటాలు పడుతుంటాం... అయితే ఎటువంటి మూలలైనా అయినా చక్కగా కనపడేలా తయారుచేయవచ్చు.. ఎలాగంటారా.? చదవండి ఈ చిట్కాలను మరి. మీరు ఏ మూలనైతే ఎంచుకుంటారో ఆ మూలలో పాతబడిన మంచి డిజైన్‌లో ఉన్న కుర్చీలు అందంగా అమర్చి, అక్కడే టెర్రకోట కుండలను కూడా ఉంచాలి... అలాగే గోడలకు కటింగ్ గ్లాస్ పెయింటింగ్ ఉన్న ఫ్రేమ్‌తో పాటు సీలింగ్‌కు లైట్లను వేలాడదీస్తే చూడ్డానికి చక్కగా ఉంటుంది.
అలాగే మీ ఇంటిలో కిటికీ దగ్గరగా మూల ఉన్నట్లైతే అక్కడ ఫిష్ ఎక్వేరియం అమర్చిచూడండి. కిటకీ నుంచి వచ్చే చల్లని పిల్ల గాలులను ఆస్వాదిస్తూ బుల్లి సముద్రాన్ని ఇంటిలోనే చూసెయ్యొచ్చు. అలాగే కార్నర్స్‌ను అందమైన పూల తొట్టెలతోనూ అలంకరించవచ్చు. ఇంకా చిన్నపాటి స్టూల్ వేసి వెల్వెట్ దుస్తులు కప్పి ఫ్లవర్ వాజ్‌లతో అలంకరించుకుంటే మీ ఇల్లు అదిరిపోతుంది.