వంటింటి చిట్కాలు: కుకింగ్ వెసెల్స్‌ను ఎలా శుభ్రం చేయాలి?

శుక్రవారం, 15 మే 2015 (17:09 IST)
కూరగాయలు, పండ్లు అయినా, ఉపయోగించే పాత్రలు, ఇతర ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులనైనా ఎప్పటికప్పుడు శుభ్రంగా కడగాలి. ఫ్రిజ్ లోపలి, బయటి ఉపరితలాన్ని వెనిగర్ నీరు కలిపి శుభ్రం చేయాలి. ప్రతి అరను విడివిడిగా కడగాలి. కూరగాయలుంచే ట్రేను తరచూ కడగాలి. ఎలక్ట్రిక్ స్విచ్ కట్టేసి పనులు చేయాలి. 
 
అలాగే మైక్రోవేవ్ ఓవెన్ లోపల వుండే రొటేటింగ్ ట్రే బయటకు తీసి కడగాలి. కోలిన్, ప్రిల్ స్ప్రే వంటి బహుళ ప్రయోజని లిక్విడ్‌తో ముందువైపు వుండే అద్దాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. క్లీనింగ్ ప్యాడ్‌తో లోపలపడిన మరకల్ని అద్దేయాలి. మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్‌లో నీరుపోసి వుంచి ఐదు నిమిషాల పాటు వేడిచేస్తే లోపల పడిన మరకల్ని సులువుగా తుడిచేయవచ్చు. 
 
ప్రతిరోజూ వంట పాత్రలు, వర్క్ టాప్స్, స్టవ్, మిక్సీలను శుభ్రం చేయాలి. అలాగే మైక్రోవేవ్, ఫ్రిజ్, అప్రాన్‌లు, టోస్టర్, క్యాబినెట్‌ల అద్దాలు, వర్క్ టాప్స్, వాల్ టైల్స్‌ను వారానికోసారి శుభ్రచేయాలి. నెలకోసారి పూర్తిస్థాయిలో ఫ్రిజ్, సివేజీ సిస్టమ్, తలుపులు, అలమరల, ఎగ్జాస్ ఫ్యాన్స్ లేదా చిమ్నిని శుభ్రం చేసుకోవాలి. 

వెబ్దునియా పై చదవండి