చిన్న చిన్న పూలకుండీలతో అందమైన ఇల్లు మీ సొంతం!

గురువారం, 24 మార్చి 2016 (10:10 IST)
మీ ఇళ్లు పెద్దదైనా, చిన్నదైనా మీ ఇంటిని అందంగా మార్చేది... ఇంటీరియర్ డెకరేషనే. ఇంటీరియర్ డెకరేషన్‌కు పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుచేయలేనివారు... చాలా సులభమైన రీతిలో ఇంటీరియర్ డెకరేషన్‌తో ఇంటిని అలంకరించవచ్చు. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా.. చిన్న చిన్న కుండీల్లో అందమైన మొక్కలను కొనుగోలు చేసి అక్కడక్కడా అందంగా అమర్చడమే. 
 
ఇలాచేయడం ద్వారా ఇంటి అందం పలు రెట్లు అధికమవుతుందని గృహాలంకరణ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇంటి అందం కోసం పెట్టే పూల కుండీలు సూర్యరశ్మి తగిలేలా పెట్టాలి. సూర్య కిరణాలు ప్రత్యక్షంగా మొక్కలపై పడకుండా చూసుకోవాలి.
 
పూల మొక్కల కంటే క్రోటాన్స్ వంటి చెట్ల రకాలను ఎంచుకోవచ్చు. పూల మొక్కల్ని మాత్రమే గాకుండా మీ ఇంటిని అప్పుడప్పుడు శుభ్రం చేస్తూ.. ఇతరత్రా వస్తువులను అందంగా పేర్చుకుంటూ పోతే మీ ఇల్లు అతిథులను ఆకర్షిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి