Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటిరీయర్ డెకరేషన్: వంటగదిని ఎలా డిజైన్ చేసుకోవాలంటే?

ఇంటిరీయర్ డెకరేషన్: వంటగదిని ఎలా డిజైన్ చేసుకోవాలంటే?
, గురువారం, 31 జులై 2014 (15:33 IST)
ప్రస్తుతం ఆధునికమైన మాడ్యులర్ కిచెన్ రూంను తయారు చేసుకుంటున్నారు చాలామంది. దీంతో వంటగదిని అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు. మీ ఇంట్లో ఎక్కువ సామాన్లున్నా తక్కువ స్థలంలోనే వంటగదిని డిజైన్ చేసుకోవాలంటే..?
 
* వంటగది నిర్మాణంలో మీరు తీసుకునే జాగ్రత్తలేంటంటే...మీరు నిర్మించిన వంటగదిలో నీరు, నిప్పుతో ఇబ్బంది పడకుండా ఉండేలా చూసుకోండి. 
 
* వంటగదిలో వాడే హార్డ్‌వేర్ ఎలక్ట్రికల్ వస్తువులు మంచి క్వాలిటీవిగా ఉండేలా చూసుకోండి. ధరలు తక్కువగా ఉన్నాయికదా అని నాసిరకం వాటిని వాడకండి.
 
* వంటగదిలో మీరు వాడే పాత్రలకు వీలైనంత ఎక్కువ స్థలం కేటాయించుకోండి. ఉన్న స్థలంలోనే చక్కగా అమర్చుకోండి. 
 
* వంటగది స్లాబ్ లేదా ప్లాట్ ఫామ్ మీ పొడవుకు తగ్గట్టు ఉండేలా చూసుకోండి. మరీ చిన్నదిగాను మరీ ఎత్తులోను ఉండకుండా మీరు దగ్గరుండి డిజైన్ చేసి రూపొందించుకోండి. దీంతో మీరు వంట చేసేటప్పుడు మీకు అలసట అనేది రాదు. మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోండి.
 
* పాత్రలు కడిగేందుకు వాడే షింక్ బేసిన్ కింద ఓ అర ఏర్పాటు చేసుకోండి. ఇందులో కడిగిన పాత్రలను పెట్టవచ్చు. 
 
* వంటగదిలో ఫ్రిజ్, కుకింగ్ రేంజ్ మరియు షింక్ ఒకటే వరుసలో ఉండేలా చూసుకోండి. వంట చేసేటప్పుడు వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది కనుక మీకు అందుబాటులో ఉంచుకోండి.
 
* వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పనిసరిగా ఉండేలా ఏర్పాటు చేసుకోండి. దీంతో మీరు వంట చేస్తున్నప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu