Publish Date: Wed, 20 Aug 2014 (17:24 IST)
Updated Date: Wed, 20 Aug 2014 (17:27 IST)
ఈ రోజుల్లో ఫ్రిజ్ లేని ఇల్లంటూ ఏదీ లేదు. కాస్తంత డబ్బున్న వారిళ్ళలో అయితే, మైక్రోవేవ్ ఓవెన్‌లు కూడా కనిపిస్తున్నాయి. అయితే, వీటిని శుభ్రపరిచడమెలా అనే దానిపై అనేక మందికి అనేక ప్రశ్నలు లేకపోలేదు. వీటిని ఒకసారి పరిశీలిస్తే..
ఫ్రిజ్‌ను లోపలి, బయటి ఉపరితలాన్ని మాత్రం వెనిగర్, నీరు కలిపి శుభ్రం చేయాలి. ప్రతి ఒరను విడివిడిగా కడగాలి. కూరగాయలుంచే ట్రేను తరచుగా కడగాలి. ఫ్రిజ్ లోపలి భాగాన్ని ఎలక్ట్రికల్ స్విచాఫ్ చేసి క్లీన్ చేయాలి.
మైక్రోవేవ్ ఓపెన్‌ను శుభ్రపరిచే సమయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. లోపల ఉండే రొటేటింగ్ ట్రేను బయటకు తీసి శుభ్రం చేయాలి. కోలిన్, ప్రిల్ స్ప్రే వంటి వాటిని శుభ్రంగా తడిగుడ్డతో తుడవాలి. క్లీనింగ్ ప్యాడ్‌తో లోపలపడిన మరకల్ని అద్దేయాలి. మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్‌లో నీరుపోసి ఉంచి ఐదు నిమిషాల పాటు వేడిచేస్తే లోపల పడిన మరకల్ని సులువుగా తుడిచివేయవచ్చు.