Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటిని శుభ్రంగా ఉంచే క్లీనింగ్ ఏజెంట్స్ ఏవి!?

Advertiesment
House cleanin agent products
, శనివారం, 11 అక్టోబరు 2014 (18:04 IST)
ఇంటిని శుభ్రం చేసేందుకు భారీ మొత్తాన్ని వెచ్చించి క్లీనింగ్ వస్తువులు కొంటున్నారా.? అయితే ఆగండి.. గాజు సామాన్లను క్లీన్ చేసుకొనే ద్రావణాన్ని కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక వంతు వినెగర్‌కు ఒక వంతు నీళ్ళు కలిపి, ఓ స్ప్రే బాటిల్‌లో ఉంచుకొంటే, అది గాజు సామాన్లను శుభ్రం చేయడానికి పనికొస్తుంది. అలాగే, చేతికి రబ్బరు తొడుగులు, ఇంట్లో దుమ్మూ ధూళి దులపడానికి ఉపయోగపడని కాటన్ దుస్తులను చిన్న చిన్న టవల్స్‌గా కట్ చేసి ఉపయోగించుకోవచ్చు. 
 
ఉప్పు, వంట సోడా, వినెగర్, నిమ్మకాయ లాంటివి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి తోడ్పడతాయి. ఉప్పు - కప్పులు, మగ్గులు టీ, కాఫీ మరకలతో ఎబ్బెట్టుగా తయారైతే, వాటిలో కొద్దిగా ఉప్పు చల్లి, అలా కాసేపు ఉంచేయాలి. ఆ తరువాత వాటిని రుద్ది, కడిగితే మరక మాయం. కప్పులు, మగ్గులు తేమగా ఉన్నప్పుడు ఈ పని చేస్తే మరింత సులభంగా పని జరుగుతుంది.
 
కూరలు తరిగే పీట క్రిమిరహితంగా ఉండాలంటే, దాని మీద కొద్దిగా ఉప్పు చల్లి, కొన్ని నిమిషాల తరువాత బాగా రుద్ది, నీటితో కడిగేయాలి. అల్యూమినియమ్ ఫ్రేమ్‌లను శుభ్రం చేయాలంటే, తడి గుడ్డ మీద కొద్దిగా ఉప్పు చల్లి, దానితో ఆ ఫ్రేమ్‌లను తుడవాలి. చీమలు, ఈగల బెడద లేకుండా ఉండాలంటే, నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి, దానితో గచ్చు తుడిస్తే సరి. వంటింట్లో గ్యాస్ స్టవ్ మీద పడ్డ మరకలను పోగొట్టాలంటే, సమపాళ్ళలో వంటసోడా, ఉప్పు కలిపి, పేస్ట్‌లా తయారు చేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu