Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్లాస్టిక్ వస్తువులను సులభంగా క్లీన్ చేయాలంటే?

Advertiesment
Best and simple tips for plastic materials
, బుధవారం, 22 అక్టోబరు 2014 (16:18 IST)
ప్లాస్టిక్ వస్తువులను సులభంగా క్లీన్ చేయాలంటే? అవి ఎప్పుడూ శుభ్రంగా ఉండాలంటే.. ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే. ప్లాస్టిక్ వస్తువులను శుభ్రం చేయాలనుకొన్నప్పుడు ముందుగా చల్లటి నీటితో కడిగేయాలి. తర్వాత ఒక టబ్ నీటిలో 10నిముషాలు నానబెట్టాలి. ఆ సమయంలో పాతవాసనలు తొలగిపోతాయి. తర్వాత బయటకు తీసి, పొడి బట్టతో తుడవటం వల్ల వాసన తొలగిపోతుంది. 
 
ఇలా చేయడంతో పాటు.. 
కొత్తప్లాస్టిక్ వస్తువులను కొనుగోలు చేసినప్పుడు వాటి నుండి కొత్తగా ప్లాస్టిక్ వాసన వస్తుంటే, న్యూస్ పేపర్ తీసుకొని బాగా ఉండచుట్టి ప్లాస్టివస్తువుల్లో స్టఫ్ చేసి పెట్టాలి. ఇది ప్లాస్టిక్ వాసన తొలగించడానికి బాగా సహాయపడుతుంది. తర్వాత మరుసటి రోజు వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
బేకింగ్ సోడా మరియు కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ప్లాస్టిక్ వస్తువులకు అప్లై చేసి ఒకటి లేదా రెండు రోజులు అలాగే ఉంచి తర్వాత మంచి నీటితో కడిగితే మొండి మరకలు తొలగిపోతాయి.
 
ప్లాస్టిక్ వస్తువులను శుభ్రం చేయడానికి మరో ఉత్తమ మార్గం నిమ్మరసం. నిమ్మతొక్కతో ప్లాస్టిక్ వస్తువులను రుద్ది కడగడం వల్ల ప్లాస్టిక్ వాసన, ఇతర ఆహార పదార్థాల వాసనలు తొలగిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu