Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లివింగ్ రూమ్, పిల్లల గదులకు నప్పే రంగులు

లివింగ్ రూమ్, పిల్లల గదులకు నప్పే రంగులు

Ganesh

, శుక్రవారం, 23 జనవరి 2009 (20:00 IST)
FileFILE
గత వ్యాసంలో ముదురు రంగులను సాధారణ గదులకు ఎలా వాడాలో చూశాం కదా...! ఈరోజు లివింగ్ రూమ్, హాల్, పిల్లల గదులకు ఎలావాడాలి? ఎలాంటి రంగులు వాడాలో తెలుసుకుందాం.

ముదురురంగులు వాడటం ఇప్పుడు ఫ్యాషన్ అన్న సంగతిని ఇదివరకటి వ్యాసంలోనే చదువుకున్నాం. ఈ ముదురురంగులు గదని తేజోవంతంగా ఉంచటమేగాకుండా ఇంటికి కొత్త అందాన్నిస్తాయి. అయితే వీటిని వాడటానికి ముందు, ఎంపిక చేసుకునేముందు కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం.
పోస్టల్ రంగులతో మరింత అందం...!
  హాల్‌కి తెలుపు లేదా పోస్టల్ రంగుల్లో వేటినైనా వాడొచ్చు. ఇవి గోడలకు వేయడం వల్ల ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. అంతేగాకుండా మన ఇంటికి వచ్చే అతిధులకు స్వాగతం పలుకుతున్నట్టుగా కూడా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ రంగులు అతిథ్యానికి నిదర్శనం అని...      


ఇప్పుడు లివింగ్ రూమ్, హాల్‌లకు ఎలాంటి రంగులను వాడితో చూడటానికి బాగుంటాయి, ఎలాంటివి ఎంపిక చేసుకోవాలి అన్న విషయాలను తెలుసుకుందాం.

హాల్‌కి తెలుపు లేదా పోస్టల్ రంగుల్లో వేటినైనా వాడొచ్చు. ఇవి గోడలకు వేయడం వల్ల ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. అంతేగాకుండా మన ఇంటికి వచ్చే అతిధులకు స్వాగతం పలుకుతున్నట్టుగా కూడా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ రంగులు అతిథ్యానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు.

ఇకపోతే... తలుపులు, కిటికీలు లేని గదికి ముదురు రంగు షేడ్‌లను వాడితే చూసేందుకు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. ముదురు, లేత రంగులు ఏవైనప్పటికీ కూడా సరైన రంగులు ఎంపిక చేసుకోవడమన్నదే ముఖ్యమైన విషయం. అలా ఎన్నుకుంటేగానీ మీ గదికి మీరు కోరుకున్న అందం చేకూరుతుంది.

లివింగ్ రూమ్ అనేది శారీరకంగా, మానసికంగా విశ్రాంతి తీసుకునేది కాబట్టి, సాధ్యమైనంత సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి ఈ గదికి ఆకుపచ్చ, నీలం, గులాబి లాంటి పోస్టల్ రంగులు లేదా న్యూట్రల్ షేడ్‌లను వాడితే మంచిది.

ఇక ముఖ్యంగా చిన్న పిల్లలను ప్రభావితం చేసే వారి గదులకు ఎలాంటి రంగులు వాడాలో చూద్దాం. పిల్లలు వారి గదిలో ఆడటం, చదవటం, నిద్రపోవటం లాంటివి చేస్తారు కాబట్టి అదే వాళ్ల ప్రపంచం. వారిని ఆకట్టుకునేలాగా వారి గదులలో ఎన్నో రకాల ప్రయోగాలు చేయవచ్చు.

ముదురురంగులు వాడటమే గాకుండా, గోడలమీద రకరకాల డిజైన్లు వేయటం, ఒకే గోడమీద రెండు రంగులు వాడటం లాంటివి చేయవచ్చు. అంతేగాకుండా పిల్లలను సంప్రదించి వారి గదిని ఎలా ఉండాలని కోరుకుంటున్నారో తెలుసుకుని అందుకనుగుణంగా ఏర్పరిస్తే వారి ఆనందానికి అవధులే ఉండవు.

రంగుల విషయంలో గమనించాల్సింది ఏమిటంటే... ముదురు రంగులను ఎంపిక చేసుకోవడం మంచిదే అయినప్పటికీ వాటి ఖర్చు గురించి కూడా ముందుగానే తెలుసుకుని ఒక స్పష్టమైన అవగాహనతో ఉండటం మంచిది. ముదురురంగులతో కూడా గృహ సౌందర్యాన్ని ఎలా మెరుగుపరచుకోవచ్చో మనం చెప్పుకున్న రెండు వ్యాసాల ద్వారా తెలుసుకున్నారు కదూ...!

Share this Story:

Follow Webdunia telugu