తన ముందు ప్రస్తుతం చాలా లక్ష్యాలున్నాయని అమెరికా ఓపెన్ టైటిల్ విజేత రోజర్ ఫెదరర్ పేర్కొన్నాడు. వరుసగా ఐదుసార్లు అమెరికా ఓపెన్ టైటిల్ నెగ్గినా తాను సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా మిగిలి ఉన్నాయని ఫెదరర్ వ్యాఖ్యానించాడు.
ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్న ఫెదరర్ తన తదుపరి లక్ష్యాల గురించి మీడియాకు వివరించాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఊరిస్తూ వస్తోన్న ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించడంతో పాటు లండన్ ఒలింపిక్‌లో స్వర్ణాన్ని సాధించడం తన భవిష్యత్ లక్ష్యాలని అన్నాడు.
దీంతో పాటు స్విట్జర్లాండ్‌కు డేవిస్ కప్ అందించడం కూడా తన లక్ష్యంలో భాగమేనని ఫెదరర్ పేర్కొన్నాడు. విమర్శకులు ఏ విధంగా మాట్లాడినా లక్ష్యాలు సాధించడంలో తాను వెనకడుగు వేయనని అన్నాడు. తన కెరీర్ ప్రస్తుతం సాఫీగానే సాగుతోందని ఫెదరర్ పేర్కొన్నాడు.
అమెరికా ఓపెన్‌లో టైటిల్ సాధించడం ద్వారా తన పూర్వపు ఫామ్‌ను తిరిగి సంపాధించానని, తదుపరి లక్ష్యాలను అందుకునేందుకు అవసరమైన సత్తా తన వద్ద ఉందని ఫెదరర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.