Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు గడ్డపై మహాత్ముడు

తెలుగు గడ్డపై మహాత్ముడు
, గురువారం, 14 ఆగస్టు 2014 (21:31 IST)
స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా మహాత్మాగాంధీ ఆంధ్రప్రదేశ్‌లో చాలా చోట్ల పర్యటించారు. అప్పట్లో ఆయనకు తెలుగు జనం నీరాజనం పట్టారు. ఇంచుమించు 12 రోజుల పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెల్లో ఆయన కాలు మోపారు. పోయిన చోటల్లా ఉపన్యాసాలు ఇచ్చి చాలా మందిని ఉద్యమం వైపు ఆకర్షించ గలిగారు. ఆయన పర్యటనలలో చాలా చొట్ల దళిత గ్రామాలను సందర్శించారు. 
 
వారి కోసం ఆలయాలను నిర్మింప చేశారు. ఆలయాలలో వారి ప్రవేశం కల్పించేందుకు ప్రయత్నం చేశారు. వారిలో ఛైతన్యం కోసం కార్యక్రమాలను చేపట్టారు.  బ్రిటీష్ వారిని తిరుమల ఆలయంలో దర్శనం కల్పించగా లేని భారత జాతీయులైన వారిని ఎందుకు అనుమతించరని అప్పటి కమిషనర్‌ను ప్రశ్నించారు. దళితులకు బాసటగా నిలిచారు. ఆయన రాకకు పల్లె పల్లె వేయి కళ్ళతో ఎదురు చూశారు. బహిరంగ సభలకు భారీ ఎత్తున తరలి వచ్చారు. మహాత్ముడి ఆంధ్రా పర్యటన 1933లో ఇలా సాగింది. 
 
1933 డిసెంబర్ 16:  ఉదయం 3 గంటల ప్రాంతలో బెజవాడ చేకురున్న ఆయనకు భారీ స్వాగతం లభించింది. అదే రోజు పడమట లంక, ఇడుపుగల్లు, మంగళరాజాపురాలను సందర్శించారు. అక్కడి జనాన్ని కలుసుకున్నారు. బెజవాడలో దళిత ప్రాంతాలలోని జనాన్ని కలుసుకున్నారు. మహిళలు ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్ధేశించి మాట్లాడారు. 
 
డిసెంబర్ 17: ముదునూరులో దళితుల కోసం రెండు దేవాలయాలను ఆరంభించారు. గుడివాడ, ముసిపట్నం బహిరంగ సభలో మాట్లాడారు. సిద్ధంటం లో కూడా ఆయన దళితుల దేవాలయాన్ని ఆరంభించారు. అదే సమయంలో చెల్లపల్లె, అంగలూరు, గుడ్లవల్లేరు, కవుటారం, పెద్దన గ్రామాలను అదే రోజు సందర్శించారు. డిసెంబర్ 18: ఆయన ఈ రోజును మసులి పట్నంలో మౌనవ్రతం పాటించారు. 
 
డిసెంబర్ 19: కంకిపాడు, పమరు, బాట్లపెనుమార్రు ప్రాంతాలలో సాయంత్రం పర్యటించిన ఆయన తిరిగి బెజవాడ చేరుకున్నారు. అక్కడు నుంచి చెన్నైకు బయలు దేరారు. 
 
డిసెంబర్ 22: చెన్నైలో జరిగిన ఆంధ్రమహాసభలో నాగేశ్వర రావు చిత్రపటాన్ని గాంధీ ఆవిష్కరించారు. 
 
హింధీ ప్రచార సభలో పాల్గొన్నారు. ఆయన గుంటూరుకు బయలుదేరారు. 
 
డిసెంబర్ 23: గుంటూరు చేరుకున్నారు. ఈ ప్రాంతంలోని చేబ్రోలు, మునిపల్లె, వెల్లలూరు, పొన్నూర్లలో పర్యటించారు. అలాగే జబ్బుపడ్డ కొండా వెంకటప్పయ్య భార్యను పరామర్శించారు. తాళ్ళపాళెంలో ఆయుర్వేద కుటీరాన్ని ప్రారంభించారు. నాయుడు బ్రోలులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కావూరులో వినయ్ ఆశ్రమం భవనానికి పునాది వేశారు. ఇక్కడ దళితులనుద్దేశించి మాట్లాడారు. తరువాత తెనాలిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 
 
డిసెంబర్ 24: ఉదయం 10.40 గంటలకు సామర్లకోట చేరుకున్నారు. తరవాత పెద్దాపురం, కాకినాడలలో జరిగిన సభలలో పాల్గొన్నారు. మహిళా సమావేశంలో ప్రసంగించారు. గొల్లపాళెం, రామచంద్రాపురం, వాల్మీకి ఆశ్రమంలలో పర్యటించారు. రాత్రి 7.30 గంటలకు రాజమండ్రి చేరుకుని బహిరంగ సభలో పాల్గొన్నారు. దళిత నాయకులతో మాట్లాడారు. రాత్రి రాజమండ్రిలోనే బస చేశారు. 
 
డిసెంబర్ 25: ఉదయం సీతానగరం చేరుకుని మౌనవ్రతం పాటించారు. 
డిసెంబర్ 26: వంగలపాడు చేరుకుని సీతారామస్వామి దేవాలయాన్ని ప్రారంభించారు. సీతారామనగరంలో హరిజన ఆశ్రమం, కోదండంలో రెండు దేవాలయాలను ఆరంభించారు. తాళ్ళపుడి, మలకపల్లె, ధర్మవరం, నిడదవోలులో పర్యటించారు. రాత్రికి తణుకు చేరుకున్నారు. 
 
డిసెంబర్ 27: తణుకు ప్రాంతంలోని ఎలిటిపాడు, కవితం, పోడూరు, వేదంగి జిన్నురూర్, బల్లిపాడు, ప్రాంతాలలో పర్యటించారు. అదే రోజు పాలకొల్లు, తాడేపల్లెగూడెం, భీమవరం, లో ఏర్పాటైన బహిరంగ సభలో ప్రసంగించారు. హరిజన ఆశ్రమానికి పునాది వేశారు. సాయంత్రం 5 గంటలకు ఎల్లోరా చేరుకున్నారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. అర్య ఆంధ్ర సంఘంలో లజపతిరాయ్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. 
 
డిసెంబర్ 28: కాంగ్రెస్ కార్యకర్తలను కలుకున్నారు.  ఎల్లోరా నుంచి విజయనగరం బయలు దేరారు. మధ్యహ్నానానికి అక్కడుకు చేరుకుని మహిళా సభలో ప్రసంగించారు. అలాగే భిమిలీ పట్నం, రామమందిరం గ్రామాలను సందర్శించారు. విజయనగరంలో దళిత నాయకులను కలుసుకున్నారు.
 
డిసెంబర్ 29: విజయనగరంలో జరిగిన దళితవాడలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనకాపల్లె, బిట్రగుంటలలో పర్యటించారు. 
 
డిసెంబర్ 30: నెల్లూరు జిల్లాలోని కావలి, అల్లూరు, గందవరం, ఎల్లయ్యపాలెం, బుచ్చిరెడ్డి పాలెం ప్రాంతాలలో జరిగిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. నెల్లూరులోని దళితవాడలో రీడింగ్ రూం‌ను ప్రారంభించారు. ఇక్కడా బహిరంగ సభలు, మహిళా సమావేశాల్లో పాల్గొన్నారు. గూడూరులోని బహిరంగ సభలో ప్రసంగించిన తరువాత వెంకటగిరి వెళ్ళారు. 
 
డిసెంబర్ 31: ఇక్కడా దళితులకు రీడింగు రూంకు పునాది రాయి వేశారు. బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక్కడ నుంచి నేరుగా తిరుపతి చేరుకున్నారు. అక్కడ శ్రీవారి ఆలయంలోకి దళితులకు అనుమతి ఇవ్వాలని కోరారు.  ఈ మేరకు అప్పటి అధికారులతో మాట్లాడారు. తరువాత తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.  రేణిగుంట మీదుగా కడప జిల్లా పర్యటనకు బయలుదేరారు. 
 
1934 జనవరి 1 : కడపకు చేరుకున్న ఆయన అక్కడ మౌనవ్రతం పాటించారు. 
 
1934 జనవరి 2 : దళిత కార్మికులతో మాట్లాడారు. స్వదేశీ ఎంపోరియం ప్రారంభించారు. దళితవాడలో బహిరంగ సభలో మాట్లాడారు. 
 
1934 జనవరి 3 : పెద్దవడదగూరులో పర్యటించారు. తెల్లవారు జామున 4.30 గంటలకు జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. అక్కడ నుంచి అనంతపురం జిల్లా గుత్తికి బయలుదేరారు. గుత్తిలో పర్యటించిన ఆయన అదే రోజు గుంతకల్లులో ప్రాంతంలోని తన్నేరి దళితవాడలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. కొనకొండ్ల, వజ్రకరూర్, ఉరవకొండ ప్రాంతాల్లో పర్యటించి అనంతపురం చేరుకున్నారు. అక్కడి దళితవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం హిందూపురం అక్కడ నుంచి కర్ణాటక వెళ్ళారు. 

Share this Story:

Follow Webdunia telugu