స్వీట్ బేబీల కోసం "స్వీట్ ఇడ్లీ"
కావలసిన పదార్థాలు :ఇడ్లీ రవ్వ... 300 గ్రా.మినప్పప్పు... 150 గ్రా.యాలకులపొడి... ఒక టీ.కొబ్బరితురుము... ఒక కప్పువంటసోడా... అర టీ.ఎండు ఖర్జూరం ముక్కలు.. రెండు టీ.ఎండుద్రాక్ష... రెండు టీ.పాలు... ఒకటిన్నర కప్పుపంచదార... ఒకటిన్నర కప్పుతయారీ విధానం :మినప్పప్పుని మూడు గంటలపాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఉప్పు కలిపి ఎనిమిది గంటలసేపు పక్కనబెట్టాలి. నేతిలో రవ్వను గోధుమరంగులోకి మారేవరకూ వేయించాలి. మినప్పిండిలో రవ్వ, ఉప్పు కూడా వేసి కలపాలి. తరువాత కొబ్బరి తురుము, యాలకులపొడి, పంచదార, ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరం, పాలు కూడా పోసి ఓ అరగంటసేపు అలాగే ఉంచాలి.ఆపై నెయ్యి పూసిన ఇడ్లీ ప్లేట్లలో ఈ పిండి వేసి ఆవిరిమీద ఉడికించి దించేయాలి. అంతే వేడి వేడి స్వీట్ ఇడ్లీలు తయార్..! వీటిని ఏదేనీ చట్నీతోగానీ, అలాగే అయినా తినవచ్చు. చాలా రుచిగా, వెరైటీగా ఉండే ఈ స్వీట్ ఇడ్లీలను చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు.