కావలసిన పదార్థాలు :
సెనగపప్పు... పావు కేజీ
టమాటో... రెండు
ఉల్లిపాయలు... రెండు
కొత్తి మీర తరుగు... వాసనకు తగినంత
పచ్చి మిర్చి...ఐదు
ఉప్పు... తగినంత
నూనె... వేపుడుకు సరిపడా
తయారీ విధానం :
సెనగపప్పును ముందురోజు రాత్రి నీటిలో నానబెట్టి, పొద్దున్నే మిక్సిలో వేసుకొని ముద్దగా చేసుకోండి. బాణలిలో నూనె పోసి ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆపై టమాటో ముక్కలు, సరిపడా కారం, ఉప్పు వేసి బాగా కలిపి తగినంత నీటిని పోసి ఉడికించాలి.
కూర ఉడుకుతుండగా... నూరిన సెనగపప్పు మిశ్రమాన్ని ఉండలు ఉండలుగా వేసి ఉడికించాలి. ఈ పద్ధతి నచ్చనివారు టమోటా, కారం వేసిన తరువాత నూరిన పప్పు మిశ్రమాన్ని కలిపి వేయించి కొద్దిగా నీరు పోసి ఉడికించి దించేయాలి.
పై రెండు పద్ధతుల్లోనూ కూర ఉడికిన తరువాత... దించేముందు కొత్తిమీర తరుగు చల్లి దించుకోవాలి. అంతే శనగపప్పుతో కూర రెడీ అయినట్లే...! అవసరమైతే ఈ కూరలో ఒక టీస్పూన్ ధనియాల పొడి కూడా చేర్చుకోవచ్చు.