షుగర్ వ్యాధిగ్రస్తులకు "అరటి కాండం పచ్చడి"
కావలసిన పదార్థాలు : అరటి కాండం... 1 కేజీ (నార తీసి ముక్కలుగా తరిగింది)నిమ్మకాయలు... 15 కాయలుఎండు మిరపకాయలు... 50 గ్రా.ఆవాలు... 50 గ్రా.పెరుగు... 250 మిలీపసుపు... 5 గ్రా.ఉప్పు... 25 గ్రా.కరివేపాకు... సరిపడాపోపుదినుసులు... సరిపడాతయారీ విధానం : ముందుగా అరటి కాండం ముక్కలు, ఎండుమిరపకాయలు, ఆవాలను కాస్తంత నూనెలో వేయించి, ఆపై రుబ్బి ఉంచుకోవాలి. తరువాత నిమ్మకాయలను ముక్కలుగా చేసుకుని నూరుకున్న మిశ్రమానికి కలపాలి. తరువాత దీనికి సరిపడా ఉప్పు, పసుపు, పెరుగులను కూడా కలుపుకోవాలి. ఆపై కరివేపాకు, పోపు దినుసులతో పోపు పెట్టుకోవాలి. అంతే అరటికాండం పచ్చడి సిద్ధమైనట్లే. ఈ అరటికాండం పచ్చడి మధుమేహ వ్యాధి (షుగర్) ఉన్నవారికి మంచిది. అంతేగాకుండా ఇది దోసె, చపాతీలకు కూడా భలే రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది కూడా..!!