కావలసిన పదార్థాలు :
పెద్దసైజు కాకరకాయలు... పావుకేజీ
సెనగపిండి... 50గ్రా.
అల్లంవెల్లుల్లి ముద్ద... ఒక టీస్పూను
కరివేపాకు... రెండు రెమ్మలు
పచ్చిమిర్చి... నాలుగు
ఆమ్చూర్... అరటీ.
కారం... అరటీ.
రెడ్ ఆరెంజ్ కలర్... చిటికెడు
ఉప్పు... తగినంత
నూనె... వేయించేందుకు సరిపడా
తయారీ విధానం :
ముందుగా కాకరకాయలను గుండ్రని చిప్స్లాగ కోసి ఉంచాలి. తరవాత వీటిని మరుగుతున్న నీటిలో వేసి 5 నిమిషాలు ఉడికించి నీళ్లు వార్చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో శెనగపిండి, అల్లంవెల్లుల్లి, కరివేపాకు, ఆమ్చూర్, కారం, రెడ్ ఆరెంజ్ కలర్, ఉప్పు తీసుకుని.. తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి.
చివర్లో ఉడికించి ఉంచిన కాకరకాయ ముక్కలను ఈ పిండిలో వేసి కలపాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి సరిపడా నూనె పోసి కాగిన తరువాత పిండిలో కలిపిన కాకరకాయ ముక్కల్ని వేసి, గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే శెనగపిండితో కాకరకాయ చిప్స్ తయారైనట్లే..!!