Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేడన్నంలోకి "క్యాప్సికమ్‌ పచ్చడి" చేద్దామా...?

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
క్యాప్సికమ్... పావు కేజీ
చింతపండుగుజ్జు... నాలుగు టీ.
వెల్లుల్లిరేకలు... పది
ఉప్పు... తగినంత
పసుపు... చిటికెడు
ఎండుమిరపకాయలు... ఆరు
నూనె... 4 టీ.
పోపుకోసం మినప్పప్పు... ఒక టీ.
ఆవాలు... ఒక టీ.
మెంతులు... అర టీ.

తయారీ విధానం :
క్యాప్సికమ్‌ను కడిగి ముక్కలుగా కోయాలి. స్టవ్‌మీద కళాయి పెట్టి నూనె వేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయించి తీయాలి. అందులోనే మరికాస్త నూనె వేసి క్యాప్సికమ్‌ ముక్కలు వేసి మూతపెట్టి మంట తగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ముక్కలు మెత్తబడ్డ తరువాత దించి చింతపండు, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రేకలు, ఎండుమిర్చి వేసి మెత్తగా రుబ్బి తాలింపు పెట్టాలి. అంతే క్యాప్సికమ్ పచ్చడి రెడీ..!

Share this Story:

Follow Webdunia telugu