Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"వెల్లుల్లి ఆవకాయ"లో యాంటాక్సిడెంట్లు అధికం..!

Advertiesment
భారతీయ
FILE
కావలసిన పదార్థాలు :
తొక్క తీసిన వెల్లుల్లి.. 4 కప్పులు
ఉప్పు పొడి.. 1 కప్పు
మిరప పొడి.. 1 కప్పు
మెంతులు.. గరిటెడు
జీలకర్ర.. గరిటెడు
ధనియాలు.. ఒకటిన్నర గరిటెడు
ఇంగువ పొడి.. 2 చిటికెలు
ఆవాలు.. గరిటెడు
మంచినూనె.. 1 కప్పు
నిమ్మపండు రసం.. 1 కప్పు
తురిమిన బెల్లం.. సరిపడా

తయారీ విధానం :
ముందుగా మెంతులు, జీలకర్ర, ధనియాలను వేరు వేరుగా బాణలిలో వేయించి ఒకటిగా చేర్చి పొడి చేసుకోవాలి. నిమ్మపండ్లు కోసి రసం పిండి కొలిచి ఉంచుకోవాలి. తొక్క తీసిన వెల్లుల్లిని కుక్కలో ఐదు నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత పొయ్యిమీద బాణలిని ఉంచి మంచినూనె వేసి, అందులో ఆవాలు, ఇంగువ పొడి, వెల్లుల్లిని చేర్చి వెంటనే పొయ్యిని ఆర్పివేయాలి.

అందులోనే ఉప్పు, మిరప పొడి, మెంతులు, జీలకర్ర, ధనియాల పొడిని కూడా చేర్చుకోవాలి. దీనికి నిమ్మరసం చేర్చి, నచ్చిన వారు బెల్లం తురుమును కూడా వేసి.. బాగా కలిపి ఊరగాయ జాడీలో వేసి గుడ్డతో మూత పెట్టాలి. అంతే.. వెల్లుల్లి ఆవకాయ రెడీ. దీనిని రెండు రోజులపాటు ఉండనిచ్చి, ఆపై తింటే బాగా రుచిగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu