వెరైటీ వంటకం "కడ్డూ కా దాల్చా"
కావలసిన పదార్థాలు :శెనగపప్పు.. పావు కేజీసొరకాయ... అర కేజీఉల్లిపాయలు.. రెండుటొమోటోలు.. రెండుబెల్లం... కొద్దిగాచింతపండు గుజ్జు... రెండు టీ.ఎండుమిర్చి.. నాలుగుపసుపు.. ఒక టీ.ఆవాలు.. ఒక టీ.కరివేపాకు... ఒక కట్టజీలకర్ర.. ఒక టీ.వెల్లుల్లి.. ఒక టీ.కొత్తిమీర తురుము.. ఒక టీ.ఉప్పు.. తగినంతనూనె... రెండు టీ.నెయ్యి.. 4 టీ.తయారీ విధానం :శెనగపప్పు కడిగి ఉడికించాలి. సొరకాయ తొక్కుతీసి ముక్కలుగా కోసి ఉంచాలి. పప్పు సగం ఉడికిన తరువాత సొరకాయ ముక్కలు వేసి పూర్తిగా ఉడికించాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె వేసి కాగాక, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి వేయాలి. ఆపై ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు వేసి మూతపెట్టి ఉడికించాలి.ఇప్పుడు సొరకాయ ముక్కలతోపాటు ఉడికించిన పప్పు, తగినంత ఉప్పు, కాస్తం బెల్లం, చింతపండు గుజ్జును కూడా పై మిశ్రమంలో వేసి బాగా కలిపి ఓ రెండు నిమిషాలు సిమ్‌లో పెట్టాలి. చివరగా నెయ్యి, కొత్తిమీర కూడా వేసి కలిపి దించి వేడి వేడిగా అతిథులకు సర్వ్ చేయాలి. అంతే కడ్డూ కా దాల్చా సిద్ధమైనట్లే..!