Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెరైటీ డిష్ "ఆలూ స్వీట్ బూందీ కప్స్"

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు... ఎనిమిది పెద్దవి
స్వీట్ బూందీ... రెండు కప్పులు
పంచదార పాకం... అర కప్పు
గార్నిష్ చేసేందుకు టూటీ ఫ్రూటీ, చెర్రీలు, జీడిపప్పులు, కిస్‌మిస్... తలా గుప్పెడు

తయారీ విధానం :
ముందుగా బంగాళాదుంపలను ఉడికించి, చల్లారాక తొక్క తీసి దుంపను మధ్యలోకి కట్ చేయాలి. అలా సగానికి కట్ చేసిన ముక్క లోపలివైపున ఉన్న గుజ్జును స్పూన్‌తో జాగ్రత్తగా తొలిచినట్లు తీసేయాలి. ఒక బంగాళాదుంప రెండు కప్పులుగా ఉంటుంది. ఇప్పుడు పంచదారను పాకం పట్టి బంగాళాదుంప కప్పులలో పోయాలి.

కాసేపటి బంగాళాదుంప కప్పులు పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఆ తరువాత ఆ కప్పులలో స్వీట్ బూందీ, చెర్రీస్, టూటీ ఫ్రూటీ, కిస్‌మిస్, జీడిపప్పులతో నింపి సర్వ్ చేయాలి. అంతే తియ్యగా అలరించే ఆలూ స్వీట్ బూందీ కప్స్ సిద్ధమైనట్లే...!!

Share this Story:

Follow Webdunia telugu