Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెరైటీ క్యాప్సికమ్ వేపుడు

Advertiesment
క్యాప్సికమ్ పావు కిలో కొబ్బరి కోరు పావు కప్పు పెసరపప్పు  పావు కప్పు మినపప్పు  కొన్ని గింజలు మిరియాలు  టీస్పూన్ ఎండు మిరపకాయలు టీస్పూన్ (వీటిని వేయించి పొడి కొట్టి పెట్టుకోవాలి) ఆవాలు
, సోమవారం, 10 మార్చి 2008 (15:01 IST)
FileFILE
కావలిసిన పదార్థాలు :
క్యాప్సికమ్ - పావు కిలో, కొబ్బరి కోరు - పావు కప్పు, పెసరపప్పు - పావు కప్పు, మినపప్పు - కొన్ని గింజలు, మిరియాలు - టీస్పూన్, ఎండు మిరపకాయలు - టీస్పూన్ (వీటిని వేయించి పొడి కొట్టి పెట్టుకోవాలి), ఆవాలు, జీలకర్ర - తలా ఓ టీస్పూన్, నూనె - నాలుగు చెంచాలు, ఉప్పు - తగినంత.

తయారు చేయు విధానం :
ముందుగా క్యాప్సికమ్‌ను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత పెసరపప్పును మెత్తగా కాకుండా ఉడకబెట్టుకోవాలి. బాణాలిలో నూనె వేసి కాగాక అందులో ఆవాలు, జీలకర్రలు వేసి తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసి తాలింపు పెట్టాలి.

ఇది బాగా వేగిన తర్వాత ఇందులో ఉడికించిన పెసరపప్పు, ఉప్పు, వేయించి పొడిగొట్టిన పొడి, కొబ్బరి కోరు, వేసి వేయించి దించి సర్వ్ చేయండి. రుచితో పాటు క్యాప్సికమ్‌లోని పోషకాలు కూడా లభిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu