Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రుచికరమైన అలసంద వడలు

Advertiesment
రుచికరమైన అలసంద వడలు ఉద్దిపప్పుతో
ఉద్దిపప్పుతో, శెనగపప్పుతో గారెలు చేసుకోవడం అందరికీ తెలిసిందే. అలాగే అలసందలతోనూ వడలు తయారు చేయవచ్చు. అలసందలతో తయారు చేసిన వడలు మంచి రుచికరంగా ఉండడమే కాక శరీరానికి మంచి పోషకాలను కూడా అందిస్తాయి.

ఈ అలసంద వడల్ని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ అలసంద వడల తయారీకి కావల్సినవి ఏవంటే... అలసందలు పావు కేజీ, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, కొత్తిమీర, ఉల్లిపాయలు, కొంచెం నూనె, కొద్దిగా ఉప్పు, జీలకర్ర.

అలసంద వడలు తయారు చేసే విధానం.

అలసందలను కొన్ని గంటలు నానబెట్టి అటుపై కొంచెం నూకగా ఉండేలా రుబ్బుకోవాలి. అల్లం, కొత్తిమీర, ఉల్లిపాయలు తగినంత తీసుకుని సన్నగా తరిగి అలసంద పిండితో కలుపుకోవాలి.

తర్వాత మాములుగా వడలు చేసే విధానంలోనే పిండిని చిన్ని ఉండలుగా చేసి చేతితో తట్టి నూనెలో ఎర్రగా వచ్చేవరకు వేయించి తీయాలి. ఇలా చేసిన అలసంద వడలు తినడానికి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu