మ్యాంగోతో సాంబార్ చేయడం ఎలా?
, శుక్రవారం, 7 డిశెంబరు 2012 (16:28 IST)
కావలసిన పదార్థాలు : కందిపప్పు : ఒక కప్పు చింతపండు : కొద్దిగాసగం పండిన మామిడి కాయ, సాంబార్ మసాలా పొడి : రెండు టేబుల్ స్పూన్లుపసుపు : పావు టీ స్పూన్, కొత్తిమీర ఆకు : ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి : రెండు మూడు రెమ్మలుమాడు ఉల్లిపాయలు, ఒక టొమేటోరెండు టేబుల్ స్పూన్ల నూనెతయారీ విధానం : ముందుగా అర టమాటో, చింతపండు, ఉల్లిపాయ ముక్కలు వేసి పప్పును ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించాలి. పప్పుగుత్తితో బాగా మెదుపుకోవాలి. ఒక ఉల్లిపాయ, పావు టమాటో, వెల్లుల్లి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిగతా టమాటో, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడాక ఉల్లి, టొమేటో, మామిడి ముక్కలువేసి, రెండు నిమిషాలు వేయించాలి.మసాలా పేస్ట్ కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. పప్పు కలిపి తగినంత నీరు పోసి, సాంబారు పొడివేసి సెగపై 12 నుంచి 15 నిమిషాలు మరగనివ్వాలి. చివరిగా కొత్తిమీరతో అలంకరించాలి.