Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"మొఘలాయీ పొటాటో"ని టేస్ట్ చేద్దామా..?

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
బేబీ పొటాటోలు... అర కేజీ
పెరుగు... రెండు కప్పులు
ఉప్పు... సరిపడా
ఉల్లిపాయలు... మూడు
నూనె... రెండు టీ.
మీగడ... అర కప్పు
ఉడికించిన బఠాణీలు... ఒక కప్పు

మసాలా కోసం :
లవంగాలు, గసగసాలు, యాలకులు... తలా ఐదేసి
పచ్చిమిర్చి... నాలుగు
అల్లం... అంగుళం
వెల్లుల్లి... నాలుగు రెబ్బలు
పంచదార... రెండు టీ.
ధనియాలపొడి, జీలకర్ర పొడి, పసుపు.. తలా ఒక్కో టీ.
గరంమసాలా, కారంపొడి... చెరో టీ.

తయారీ విధానం :
మసాలా దినుసులన్నీ ముద్దగా చేసి ఉంచుకోవాలి. బేబీ పొటాటో తొక్క తీసి గోరువెచ్చని నీళ్లలో 15 నిమిషాలు వేసి ఉంచాలి. మసాలాముద్దలో పెరుగు వేసి బాగా కలిపి దుంపలకు పట్టించాలి. బాణలిలో నూనె నూనె వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి.

తరువాత మసాలా పట్టించిన బంగాళాదుంపలు కూడా వేసి ఓ రెండు నిమిషాలు వేయించి.. ఆపై రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. బంగాళాదుంపలు సగం ఉడికిన తరువాత ఉడికించిన బఠాణీలను, పంచదారను కలిపి దుంపలు పూర్తిగా ఉడికేవరకూ ఉంచాలి. చివరగా మీగడతో అలంకరిస్తే మొఘలాయీ పొటాటో తయారైనట్లే...!

Share this Story:

Follow Webdunia telugu