కావలసిన పదార్థాలు :
వంకాయలు: 250 గ్రాములు
పచ్చి మామిడి: ఒకటి
పచ్చిమిర్చి: 35 గ్రాములు
అల్లం: చిన్న ముక్క
జీలకర్ర: అర టీస్పూను
ధనియాలు: ఒక టీస్పూను
ఉప్పు: సరిపడా
రిఫైండ్ ఆయిల్: తాలింపుకు సరిపడా
వెలుల్లి: 10 రెబ్బలు
పసుపు: అర టీస్పూను
కొత్తిమీర: ఒక కట్ట
కరివేపాకు: 2 రెమ్మలు
ఉల్లిపాయ: ఒకటి
తయారీ విధానం :
ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను ముందుగా రుబ్బుకొని పేస్ట్‌లాగా చేసుకోవాలి. బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, రుబ్బిన పచ్చిమిర్చి పేస్ట్ వేసి సన్నని సెగపై ఉడికించాలి. వంకాయకు నాలుగు వైపులా తరిగి నూనె వంకాయలా తరుక్కొని పేస్ట్‌లో వేసి ఉడకనివ్వాలి. పసుపు, ఉప్పు, వేసి కొద్ది సేపయ్యాక కప్పు నీళ్ళు పోసి ఉడికించి ఆపై తరిగిన మామిడి వేసి కలపాలి. బాగా ఉడికిన తరువాత కొత్తిమీర, కరివేపాకుతో అలంకరించుకుని దింపేయాలి. ఈ కూరను అన్నంతో పాటు రోటీలకు సైడిష్‌గా వాడుకోవచ్చు.