మామిడికాయ పొడితో "పంజాబీ చెన్నా మసాలా"
కావలసిన పదార్థాలు :తెల్ల శెనగలు.. 6 కప్పులుఉల్లిపాయ ముక్కలు.. 4 కప్పులుటొమోటోలు.. 8వెల్లుల్లి.. 30 రేకలుపచ్చిమిర్చి.. 6 (పొడవుగా సన్నగా తరగినవి)అల్లం.. 2 టీ. (సన్నగా కత్తిరించినది)నెయ్యి.. 8 టీస్పూన్లు.ధనియాలపొడి.. 2 టీ.కారం... 2 టీ.ఎండబెట్టిన మామిడిపొడి.. 2 టీ.తయారీ విధానం :ముందురోజు రాత్రి శెనగల్ని నీటిలో నానబెట్టుకోవాలి. మరుసటిరోజున వాటిని ఉడికించి ఉంచాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిలను పేస్ట్ చేసుకోవాలి. టొమోటోలను వేడినీటిలో ఉడికించి తోలుతీసి గుజ్జు చేసి ఉంచాలి. బాణలిలో నెయ్యిపోసి కాగిన తరువాత రుబ్బి ఉంచుకున్న మసాలా ముద్దను వేసి వేయించాలి. నెయ్యి పైకి తేలిన తరువాత టొమోటో గుజ్జు వేసి కాసేపు కలియబెట్టి.. అల్లం, ఉడికించి ఉంచిన శెనగలు వేసి, తగినన్ని నీరు పోసి సన్నటి సెగమీద ఉడికించాలి. తరువాత దీనికి కారం, ధనియాలపొడి, ఉప్పు, పసుపు, మామిడికాయ పొడి, పచ్చిమిర్చి కూడా కలిపి ఉడికించాలి. చివరగా, కూర చిక్కబడిన తరువాత కొత్తిమీర చల్లి దించుకోవాలి. అంతే ఘుమఘుమలాడే పంజాబీ చెన్నా మసాలా కర్రీ తయార్. ఈ కూరను ఉల్లిముక్కలమీద నిమ్మరసం, మిరియాలపొడి చల్లి పూరీలలోకి, చపాతీలలోకి వేడి వేడిగా సర్వ్ చేస్తే అదిరిపోతుంది.