బేబీకార్న్ మంచూరియన్‌ను ఎలా తయారు చేస్తారు?
, గురువారం, 25 అక్టోబరు 2012 (17:42 IST)
బేబీకార్న్‌తో అనేక రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. పచ్చి బేబీకార్న్ లేదా ఉడకబెట్టిన బేబీకార్న్‌లను ఆరగించేందుకు కూడా అనేక మంది ఇష్టపడుతుంటారు. అలాంటి బేబీకార్న్‌తో తయారు చేసే బేబీకార్న్ మంచూరియాన్‌ను ఏ విధంగా తయారు చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం. దీని తయారీకి కావాల్సిన పదార్థాలను పరిశీలిస్తే.. బేబీకార్న్ : ఐదు మొక్కజొన్న పిండి : అర కప్పు బియ్యం పిండి : పావు కప్పు కారం : కొద్దిగా అల్లం వెల్లుల్లి మిశ్రమం : ఓ టీ స్పూన్ ఉప్పు : సరిపడ నూనె : బేబీకార్న్‌లను వేయించడానికి సరిపడినంత ఉల్లిపొరక : సన్నగా తరగి పెట్టుకునే ఓ కట్ట ఉల్లిపాయ : ఒకటి (సన్నగా తరగాలి) తయారీ విధానం.. బేబీకార్న్‌ను ఒకే సైజులో తరిగి, ఉప్పు నీటిలో ఉడికించాలి. ఇప్పుడు మొక్కజొన్న, బియ్యం పిండి, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా ఉప్పు వేసి మరో పాత్రలో బజ్జీల కోసం ఏ విధంగా కలుపుకుంటారో ఆ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇందులో ఉడికించిన బేబీకార్న్‌ను ముంచి బజ్జీల మాదిరి వేయించాలి. బాణలిలో కాస్త నూనె వేడి చేసి అందులో వెల్లుల్లి పలుకులు, ఉల్లిపాయ, ఉల్లిపొర ముక్కలు ఎర్రగా వేగనివ్వాలి. ఇందులో వేయించి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కల్లి ఒక్కొక్కటి చొప్పున ఉంచాలి. పైన సోయా, చిల్లీసాస్, టొమాటో సాస్, ఇంకాస్త ఉప్పు చల్లితే వేడి వేడి బేబీకార్న్ మంచూరియా మీ ముందు సిద్ధం.