Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగాళాదుంప వడ తయారీ విధానం

Advertiesment
బంగాళాదుంప వడ తయారీ
, బుధవారం, 2 జనవరి 2008 (17:27 IST)
తీసుకోవలసిన పదార్ధాలు: బంగాళాదుంప - 350 గ్రా, బియ్యం పిండి - ఒక టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయలు - ఏడు, అల్లం - సరిపడేంత, సెనగపిండి - 60 గ్రా, కొత్తి మీర, కరివేపాకు - సరిపడేంత, బియ్యం పిండి - టేబుల్ స్పూను, ఆవాలు - టీ స్పూను, ఇంగువ, నూనె - సరిపడేంత.

ముందుగా బంగాళాదుంప ఉడికించిన తర్వతా వాటిపై ఉన్న తొక్కును తీసేసి... వాటికి ఉప్పును కలిపి మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమానికి సెనగపిండి, బియ్యం పిండి కూడా కలిపి కాసిన్ని నీళ్లు చల్లి ముద్దలా కలపాలి.

తర్వాత బాణలిలో రెండు టీ స్పూన్లు నూనె వేసి కాస్త కాగాక... ఆవాలు పోపు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసి బాగా వేయించి బంగాళాదుంప ముద్ద కూడా కలపాలి. తుంచిన కొత్తిమీర, కరివేపాకు కూడా కలుపుకుని.. అరటి ఆకుకి నూనె రాసి, బంగాళాదుంప ముద్దను సైజులు చేసుకోవాలి.

ఈ సైజులు అన్నీ నూనెను బట్టి వడలాగా ఒత్తుకుని బాణలిలో వేయాలి. ఇలా ఒకసారికి నాలుగు నుంచి ఐదు వడలు వేసుకోవడంతో బంగాళాదుంప వడలు రెడీ.. కాని వడలు వేడి తగ్గక ముందే తింటే రుచి అదిరిపోతుంది సుమా..

Share this Story:

Follow Webdunia telugu