ప్రాన్ ఫ్రైడ్ రైస్ విత్ బాయిల్డ్ ఎగ్స్
కావలసిన పదార్థాలు :చిట్టి రొయ్యలు.. అర కేజీబాస్మతి రైస్... అర కేజీకోడిగుడ్లు.. 2నూనె... అర కప్పుక్యారెట్ తరుగు.. అర కప్పుబీన్స్ తరుగు.. అర కప్పుఉల్లికాడల తురుము.. ఒక కప్పుసోయాసాస్.. ఒక టీ.గ్రీన్ చిల్లీ సాస్.. ఒక టీ.వెల్లుల్లి ముద్ద.. రెండు టీ.మిరియాలపొడి.. అర టీ.పంచదార.. పావు టీ.అజినమోటో.. పావు టీ.ఉప్పు.. తగినంతతయారీ విధానం :రొయ్యల్ని ఉడికించి పక్కనుంచాలి. క్యారెట్, బీన్స్ ముక్కల్ని కొద్దిగా ఉడికించి చల్లార్చాలి. కడాయిలో నూనె కాగిన తరువాత వెల్లుల్లి ముద్ద వేసి, కాసేపటికి ఉడికించిన రొయ్యల్ని వేసి కాసేపు వేయించాలి. సోయాసాస్, మిరియాలపొడి, అజినమోటో, ఉప్పు, పంచదార వేసి కలియబెట్టి వేయించాలి. ఆపై క్యారెట్, బీన్స్ముక్కలు కూడా వేసి, కొద్దిగా వేయించాలి. ఆ పైన ఉడికించిన అన్నం పొడిపొడిగా చల్లుతూ కలపాలి. చివరగా కోడిగుడ్డు పొరుటు, ఉల్లికాడల ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగంగా కలిపి కడాయి దించితే రొయ్యల ఫ్రైడ్ రైస్ రెడీ..!