పొటాటో స్పెషల్ "కుర్ కుర్ ఆలూ"
కావలసిన పదార్థాలు :బియ్యంపిండి... 250 గ్రా.బంగాళాదుంపలు... 125 గ్రా.వనస్పతి... 25 గ్రా.తెల్లనువ్వులు... ఒక టీ.కారం... ఒక టీ.ఉప్పు... ఒక టీ.నూనె... తగినంతతయారీ విధానం :బంగాళాదుంపలను మెత్తగా ఉడికించి, తోలుతీసి మెత్తగా మెదిపి ఉంచాలి. ఒక లోతైన పళ్లెంలో నూనె తప్ప పైన చెప్పుకున్న ఇతర పదార్థాలన్నింటినీ, బంగాళాదుంప గుజ్జునీ కలిపి తగినంత నీరు పోస్తూ గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. జంతికల గొట్టంలో రిబ్బన్ ఆకారంలో ఉండే ప్లేట్ను అమర్చి ఈ మిశ్రమాన్ని నింపాలి.నూనె బాగా కాగుతుండగా జంతికల గొట్టాన్ని అదుముతూ పిండిని నూనెలో వదలాలి. అలా వేసిన మురుకులు దోరగా వేగిన తరువాత న్యూస్ పేపర్‌పై వేయాలి. బాగా ఆరిన తరువాత గాలిదూరని డబ్బాలో భద్రపరచినట్లయితే, 15 రోజులదాకా నిల్వ ఉంటాయి. అంతే కుర్ కుర్ ఆలూ తయారైనట్లే..!