Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"పొటాటో బర్ఫీ" యమా టేస్టీ...!!

Advertiesment
వంటకాలు
FILE
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు... ఒక కేజీ
పంచదారపొడి... 800 గ్రా.
నీరు... రెండు కప్పులు
కలాఖండ్... 300 గ్రా.
నెయ్యి... 300 గ్రా.
ఎండుకొబ్బరిపొడి... 200 గ్రా.
గింజలు తీసిన డేట్స్... వంద గ్రా.
వేయించిన జీడిపప్పు... వంద గ్రా.
అల్లంమురబ్బా ముక్కలు... వంద గ్రా.
చెర్రీ పండ్లు... వంద గ్రా.
ఎండుద్రాక్ష... 50 గ్రా.
యాలకులపొడి... రెండు టీ.
లెమన్ ఫుడ్‌కలర్... అర టీ.
పచ్చకర్పూరం... అర టీ.

తయారీ విధానం :
బంగాళాదుంపల్ని కొద్దిగా ఉడికించి పొడిలా చిదమాలి. అందులో ఎండుకొబ్బరి, కలాఖండ్‌, కొద్దిగా నెయ్యి, యాలకులపొడి, పచ్చకర్పూరం వేసి కలపాలి. పంచదారలో నీళ్ళు పోసి లెమన్‌కలర్‌ వేసి తీగపాకం రానివ్వాలి. తరువాత అందులో బంగాళాదుంప మిశ్రమాన్ని వేసి అట్లకాడతో కలుపుతూ సన్నని సెగమీద కొద్దిసేపు ఉంచి ముక్కలుగా చేసిన జీడిపప్పు, అల్లంమురబ్బా, ఎండుఖర్జూరం, ఎండుద్రాక్ష, చెర్రీలు వేసి బాగా కలిపి దించితే పొటాటో బర్ఫీ తయార్...‌!

Share this Story:

Follow Webdunia telugu