కావలసిన పదార్థాలు :
పెసరపప్పు-1 కప్పు
బంగాళదుంప-1
పచ్చిబఠాణీ-3 చెంచాలు
జాజికాయ పొడి-1/2 చెంచా
పచ్చిమిర్చిముక్కలు-1 1/2 చెంచాలు
నూనె-1/4 కప్పు
నిమ్మరసం-1 కాయ
రవ్వ-1 1/2 కప్పు
కాలీఫ్లవర్-1 కప్పు పీసెస్
ఆవాలు-1 చెంచా
అల్లం ముక్కలు-1 చెంచా
కరివేపాకు-1 రెమ్మ
ఉప్పు- తగినంత
తయారీ విధానం :
ముందుగా పెసరపప్పులో ఎక్కువ నీరు పోసి పలుకుగా ఉడికించి వార్చాలి. బంగాళాదుంపలను చెక్కుతీసి సన్నగా కట్‌చేసి హాఫ్‌బాయిల్డ్ చేసి ఉంచాలి. కాలీఫ్లవర్‌ను ఉప్పు కలిపిన నీటిలో వేసి శుభ్రంగా కడిగి ఉంచాలి. కాలీఫ్లవర్‌ను కూడా హాఫ్‌బాయిల్ చేసి ఉంచాలి. బాండీలో 2 చెంచాల నూనె వేసి వెజిటబుల్స్ అన్నింటిని వేసి దోరగా వేపుకోవాలి.
వేగిన వీటిని ప్రక్కన ఉంచాలి. మిగతా నూనెను వేసి ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి వేపాలి. వేగిన వాటికి రవ్వ జతచేసి కలుపుతూ 2 నిమిషాలు వేపుకోవాలి. తరువాత మూడుకప్పుల నీరు, వేపిన ముక్కలు, పెసరపప్పు వేసి కలుపుతూ ఉడికించాలి. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. రవ్వ ఉడికి దగ్గరగా వచ్చిన తరువాత జాజికాయ పొడి, నిమ్మరసం పిండి దించి వేడి వేడిగా సర్వ్ చేయ్యాలి.