Article Indian Cookery %e0%b0%aa%e0%b1%86%e0%b0%b8%e0%b0%b0 %e0%b0%96%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d 107062900052_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెసర ఖీర్

Advertiesment
పొయ్యి మీద బాండీ పెట్టి పెసరపప్పు వేసి సన్నని మంటమీద గరిటతో కలుపుతూ ఎర్రగా వేపుకోవాలి. పప్పు ఏ మాత్రం మాడకుండా
కావలసినవి :

పెసరపప్పు-100 గ్రాములు
పంచదార -125 గ్రాములు
పాలు -1 లీటరు
నెయ్యి -1 చెంచా
కిస్‌మిస్ -1 చెంచా
జాజికాయ పొడి -అర చెంచా

తయారీ విధానం :

పొయ్యి మీద బాండీ పెట్టి పెసరపప్పు వేసి సన్నని మంటమీద గరిటతో కలుపుతూ ఎర్రగా వేపుకోవాలి. పప్పు ఏ మాత్రం మాడకుండా చూసుకోవాలి. ఈ పప్పుకి అర లీటరు పాలు కలిపి కుక్కర్‌లో పెట్టి ఉడికించాలి. ఈ లోపల పాలు గిన్నెలో పోసి కాగనిచ్చి పంచదార కలిపినప్పుడే కిస్‌మిస్ కూడా వేసి ఉడికించాలి. కుక్కర్‌లోంచి పప్పు తీసి పాలతో పప్పును బాగా మెదిపి కలపాలి. ఈ మిశ్రమానికి చిక్కగా ఉడికించిన పాల మిశ్రమం కలిపి గిన్నెలోకి తీసి జాజికాయ పొడివేసి ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా వడ్డించాలి.

Share this Story:

Follow Webdunia telugu