పూరీల్లో వెరైటీ పూరీ రంగీలా పూరీ?
సాధారణంగా పూరీల్లో మనకు రెండు మూడు రకాలు మాత్రమే తెలుసు. సాధారణ పూరీ, పాన్ పూరీ, చోళా పూరీల పేర్లు మాత్రమే మనం వినివుంటాం. అయితే, రంగీలా పూరీ అనే కొత్త రకం పూరీ చాలా మందికి తెలిసి ఉండదు. దీని తయారీని ఇపుడు తెలుసుకుందాం. రంగీలా పూరీ తయారీకి కావలసిన పదార్థాలు గోధుమ పిండి - అర కేజీ పసుపు - ఒక టీ స్పూన్ నూనె - పూరీలను కాల్చేందుకు సరిపడ. ఉప్పు - సరిపడ టొమాటో జ్యూస్ - 150 గ్రాములుపాలకూర గుజ్జు - ఐదు టేబుల్ స్పూన్లునెయ్యి - పూరీలు కాల్చడానికి సరిపడ. ఎలా తయారు చేస్తారు. గోధుమ పిండి జల్లించి మూడు ముద్దలుగా చేయాలి. ఒక్కో భాగంలో ఒక్కో రంగు వచ్చేలా... టొమాటో జ్యూస్, పసుపు, పాలకూర గుజ్జు కలుపుకోవాలి. తర్వాత ఒక్కో ముద్దకు తగినన్ని నీళ్లు కలిపి పూరీ పిండిలా చేయండి. పసుపు ముద్దను పొడవుగా, చూపుడు వేలు మందంలో తాడులా చేయండి. తర్వాత పాలకూర కలిపిన పిండిని, దానికన్నా కొంచెం పెద్దగా చేసి, అట్ట కర్రతో వత్తి పసుపు రంగు ఉన్న పిండి చుట్టూ పూర్తిగా చుట్టండి. వీటిపైన టోమాటో జ్యూస్ కలిపిన పిండిని పై రీతిలోనే చుట్టాలి. ఇలా చేసేటప్పుడు పూరీ పిండి మధ్యలో పసుపు రంగు వచ్చేలా చూసుకోవాలి. దీన్ని ముక్కలుగా చేసి పూరీల్లో వత్తి, నూనెలో పొంగేలా వేయించాలి. రంగు రంగు రంగీలా పూరీ సిద్ధం.