Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుల్లగా, ఘాటుగా నోరూరించే "చింతకాయ చట్నీ"

Advertiesment
వంటకాలు
FILE
కావలసిన పదార్థాలు :
చింతకాయలు.. పావు కేజీ
పచ్చిమిర్చి.. 75 గ్రా.
తాజా కొత్తిమీర.. ఒక కట్ట
జీలకర్ర.. ఒక టీ.
ధనియాలు.. 2 టీ.
వెల్లుల్లి.. ఒక టీ.
అల్లం.. చిన్న ముక్క
ఉప్పు.. తగినంత
ఎండుమిర్చి.. మూడు
ఆవాలు.. కాసిన్ని

తయారీ విధానం :
చింతకాయల్ని బాగా కడిగి ఆరాక, పక్కలనుండే ఈనెల్నీ.. లోపలున్న గింజల్నీ తీసి ఆరబెట్టాలి. పచ్చిమిర్చిని వేయించి.. చల్లారాక పచ్చిమిర్చి, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, చింతకాయ ముక్కలు, కొత్తిమీరలను కలిపి మెత్తగా రుబ్బాలి. తరువాత బాణలిలో నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర... అన్నీ వేసి తాలింపు చేసి పచ్చడిలో కలపాలి. చింతకాయలకు బదులు చింతపండు, పచ్చిమిర్చికి ప్రత్యామ్నాయంగా కారం వేసి కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. అంతే నోరూరించే చింతకాయ పచ్చడి సిద్ధమైనట్లే..!

Share this Story:

Follow Webdunia telugu