కావలసిన పదార్థాలు :
పుట్టగొడుగులు... 200గ్రా.
పనీర్... 50గ్రా.
జీడిపప్పు... గుప్పెడు.
బంగాళాదుంపలు... రెండు
పచ్చిమిర్చి... 4
ఉప్పు... తగినంత
కొత్తిమీర... కట్ట
నిమ్మకాయ... ఒకటి
తయారీ విధానం :
పుట్టగొడుగుల్ని శుభ్రం చేసి ఉడికించి తీయాలి. తరువాత గొడుగుకు రంధ్రం పడకుండా కాడను జాగ్రత్తగా తొలగించాలి. బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా చిదమాలి. అందులోనే పనీర్ తురుము, జీడిపప్పు ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసం కలపాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తిప్పిన గొడుగులో జాగ్రత్తగా పెట్టి వాటిని అలాగే ఓవెన్లో ఉంచి ఓ రెండు నిమిషాలు గ్రిల్ చేయాలి. స్నాక్స్‌లా తినడానికి బాగుంటాయి. ఎన్నో పోషక విలువలతో పాటు, మంచి రుచితో అలరించే స్టఫ్డ్ గొడుగుల వంటకాన్ని మీరూ ఓసారి ట్రై చేయండి మరి...!