Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుట్టగొడుగుల కర్రీ

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
పుట్టగొడుగులు.. రెండు కేజీలు
నూనె... వంద గ్రా.
ఉల్లిపాయలు... పావు కిలో
అల్లంవెల్లుల్లి ముద్ద... అర కప్పు
టొమాటోలు... పావు కేజీ
కారం... పది టీ.
ధనియాలపొడి... 60 గ్రా.
పసుపు... రెండు టీ.
మిరియాలు... పది టీ.
ఉప్పు... సరిపడా
కొత్తిమీర... ఒక కట్ట

తయారీ విధానం :
ముందుగా పుట్టగొడుగుల్ని నీళ్లలో బాగా కడిగి నీళ్లు వంపేసి పక్కకు ఉంచాలి. ఉల్లిపాయలు, టొమాటోలు, కొత్తిమీర సన్నగా తరగాలి. మిరియాలు పొడి చేసి ఉంచాలి. కడాయిలో నూనె వేసి కాగిన తరవాత ఉల్లిముక్కలు వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. అల్లంవెల్లుల్లి ముద్ద కూడా వేయాలి.

తరవాత కారం, ధనియాల పొడి, పసుపు కూడా వేసి గరిటెతో కలియబెట్టాలి. టొమాటో ముక్కలు వేసి అవి కాస్త వేగిన తరవాత ఉప్పు, మిరియాల పొడి వేసి కాసేపు ఉడకనివ్వాలి. చివరగా పుట్టగొడుగులు వేసి అవి కూడా ఉడికిన తరవాత కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే పుట్టగొడుగుల కర్రీ సిద్ధమైనట్లే..!

Share this Story:

Follow Webdunia telugu