Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుచ్చకాయతో జింజర్ షర్బత్

Advertiesment
వంటకాలు భారతీయ స్ట్రాబెర్రీ పుచ్చకాయ రసం అల్లం పేస్ట్ పంచదార అర టీస్పూన్ నీరు మిక్సీ బ్లెండ్
కావలసిన పదార్థాలు :
స్ట్రాబెర్రీలు... రెండు కప్పులు
పుచ్చకాయ రసం... మూడు కప్పులు
అల్లం పేస్ట్... అర టీ.
పంచదార... మూడు టీ.

తయారీ విధానం :
ఈనె తీసివేసిన స్టాబెర్రీలను చల్లటి నీటిలో కడిగి.. మిక్సీలో వేసి మెత్తగా అయ్యేలా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి, అందులో పుచ్చకాయ జ్యూస్, అల్లం పేస్ట్, పంచదార కూడా కలిపి మిక్సీ జార్‌లో పోసి మరోసారి బ్లెండ్ చేయాలి.

ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయ్యాక గ్లాస్‌లో పోసి సర్వ్ చేయాలి. ఇష్టం ఉన్నవారు ఐస్‌ను క్రష్ చేసి వేసుకుని తాగవచ్చు. (ఈ షర్బత్‌వో ఐరన్ అధిక మోతాదులో ఉండటంవల్ల రక్తహీనతతో బాధపడేవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. మహిళలు, గర్భిణులు, ఎదిగే పిల్లలకు ఈ జ్యూస్‌లో కావాల్సినన్ని పోషకాలు లభిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu