Article Indian Cookery %e0%b0%a6%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d %e0%b0%aa%e0%b0%82%e0%b0%9a%e0%b1%8d%e2%80%8c%e0%b0%b0%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d 108081800053_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దాల్ పంచ్‌రతన్

Advertiesment
వంటకాలు భారతీయ పెసలు మసూరి పప్పు మినుములు రాజ్‌మా ఉల్లిపాయ కారం వెన్న
FileFILE
కావలసిన పదార్థాలు :
పెసలు... 100 గ్రాములు
మసూరి పప్పు... 50 గ్రాములు
మినుములు... 50 గ్రాములు
రాజ్‌మా... 100 గ్రాములుల
ఉల్లిపాయ... ఒకటి
టొమోటోలు... రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు... అర చెంచా
కారం... అర చెంచా
వెన్న... 25 గ్రాములు
మిర్చి... నాలుగు
ధనియాల పొడి... 1 చెంచా
ఉప్పు, పసుపు... సరిపడా
అల్లం... చిన్నముక్క

తయారీ విధానం :
పైన చెప్పిన ఐదురకాల పప్పుల్నీ కలిపి నాలుగు గంటలపాటు నానబెట్టిన తరువాత కుక్కర్‌లో పప్పులన్నింటితోపాటు అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తగా ఉడికించాలి. గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయల్ని ఎర్రగా వేయించాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ధనియాలపొడి, టొమోటోలు వేసి మూతపెట్టి ఉడికించాలి.

ఈ మిశ్రమానికి దీనికి ఉడికించిన పప్పులన్నీ వేసి తగినంత ఉప్పు, పసుపు వేసి కలిపి ఉడికించాలి. కూర ఉడికిన తరువాత కిందికి దించేసి... ఒక బౌల్‌లోకి తీసుకుని దానిపై వెన్న, కొత్తిమీర చల్లి రోటీలతో సర్వ్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu