"దమ్ ఆలూ" తినే దమ్ముందా..?!
కావలసిన పదార్థాలు :బంగాళాదుంపలు... అర కేజీటొమోటో గుజ్జు... రెండు కప్పులుధనియాలపొడి... ఒక టీ.జీలకర్రపొడి... ఒక టీ.నెయ్యి... ఒక టీ.అల్లంవెల్లుల్లి... ఒక టీ.కారం... ఒక టీ.పెరుగు... ఒక టీ.ఉప్పు... తగినంతతయారీ విధానం :బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. వెడల్పాటి బాణలిలో నెయ్యి వేసి కాగాక, అల్లం వెల్లుల్లి మిశ్రమం వేసి వేయించాలి. కాసేపటి తరువాత బంగాళాదుంప ముక్కల్ని కూడా వేసి, బాగా కలియబెట్టి పది నిమిషాలపాటు వేయించాలి.ఇప్పుడు అందులోనే టొమాటో గుజ్జు పోసి ఉప్పు, కారం, ధనియాలపొడి, జీలకర్ర పొడి వేసి తక్కువ మంటమీద ఓ పదినిమిషాలు ఉడికించాలి. మంచి వాసన వస్తుండగా సిమ్‌లో పెట్టి, పెరుగు కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించి దించేస్తే వేడి వేడి దమ్ ఆలూ సిద్ధం..!