జీర్ణశక్తి పెంపొందించే "క్యారెట్ ఆవకాయ"
కావలసిన పదార్థాలు :క్యారెట్లు.. ఒక కేజీఆవపిండి.. పావు కప్పుకారం.. పావు కప్పుఉప్పు.. తగినంతజీలకర్ర పొడి.. పావు కప్పువెల్లుల్లి.. గుప్పెడునిమ్మరసం.. ఒక కప్పునూనె.. తగినంతతయారీ విధానం :క్యారెట్లను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఆ తరువాత వాటిని కావాల్సిన సైజులో ముక్కలుగా తరిగి ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆవపిండి, జీలకర్ర పొడి, కారంపొడి, తగినంత ఉప్పు, వెల్లుల్లి రేకలు వేసి బాగా కలియబెట్టాలి. అందులోనే క్యారెట్ ముక్కలు, సరిపడా నూనె వేసి బాగా కలపాలి. చివర్లో నిమ్మరసం కలిపి జాడీలోకి తీసుకోవాలి. అంతే మూడోరోజుకి నోరూరించే క్యారెట్ ఆవకాయ సిద్ధమైనట్లే..!రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే క్యారెట్ ఆవకాయ అన్ని వయస్సులవారికీ మంచిదే. ఇది ఆహారంతో కలిపి తీసుకోవటంవల్ల అందులో పీచు పదార్థాలు అధికంగా లభించి శరీరంలో జీర్ణశక్తి పెంపొందుతుంది. కంటిచూపును మెరుగుపరిచే విటమిన్-ఏ కూడా క్యారెట్లలో అధికంగా లభిస్తుంది.